Ad Code

టెస్లా మోడల్ వైఎల్ లగ్జరీ 6 సీటర్ ఎలక్ట్రిక్ SUV విడుదల : బుకింగ్‌లు ప్రారంభం


దేశీయ మార్కెట్లో  టెస్లా మోడల్ వైఎల్  పేరుతో ఒక లగ్జరీ 6 సీటర్ ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. సాధారణ మోడల్ Y తో పోలిస్తే ఈ కొత్త 'L' వెర్షన్ లోపల అడుగుపెడితే ఒక విమానంలోని బిజినెస్ క్లాస్ అనుభూతి కలుగుతుంది. ఇందులో మూడు వరుసల్లో ఆరు సీట్లు ఉన్నాయి. ముఖ్యంగా రెండో వరుసలో ఉన్న 'కెప్టెన్ సీట్లు' ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ. వీటికి పవర్ ఆర్మ్‌రెస్ట్‌లు, హీటింగ్, వెంటిలేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంటే ఎండకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ప్రయాణించవచ్చు. ఇక మూడో వరుసలో కూర్చునే వారికి కూడా హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ పెంచడంతో పాటు ప్రత్యేకంగా ఏసీ వెంట్స్ ఇచ్చి సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ఎలక్ట్రిక్ కార్లలో ప్రధానంగా రేంజ్ గురించే అందరూ ఆలోచిస్తారు. దానికి సమాధానమే ఈ మోడల్ వైఎల్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కి.మీ.ల దూరం ప్రయాణించవచ్చని టెస్లా ప్రకటించింది. వేగం విషయంలోనూ దీనికి తిరుగులేదు. కేవలం 5.0 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇక గరిష్ట వేగం గంటకు 201 కి.మీ. దూరం ప్రయాణించగలదు. దీని ధరను రూ. 61,99,000 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. రోడ్డుపై గుంతలు ఉన్నా ప్రయాణికులకు తెలియకుండా ఉండేలా అప్‌డేటెడ్ సస్పెన్షన్- అడాప్టివ్ డంపింగ్‌ను ఇందులో వాడారు. క్యాబిన్ లోపల బయటి శబ్దాలు వినిపించకుండా అకౌస్టిక్ గ్లాస్ ఏర్పాటు చేశారు. ప్రయాణంలో ఎంటర్టైన్మెంట్ కోసం 18 స్పీకర్ల భారీ ఆడియో సిస్టమ్, భారీ స్క్రీన్‌లో యూట్యూబ్, స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ సేవలను ఆస్వాదించవచ్చు. లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇచ్చే శాటిలైట్ మ్యాప్స్ కూడా ఇందులో ఇన్-బిల్ట్‌గా వస్తాయి. ఫ్యామిలీతో కాకుండా ఎక్కువ లగేజీతో ట్రావెల్ చేయాలనుకుంటే, సీట్లను మడతపెట్టేయవచ్చు. అలా చేసినప్పుడు ఏకంగా 2,539 లీటర్ల ఖాళీ స్థలం ఏర్పడుతుంది. అంటే మీరు బెడ్లు, సైకిళ్లు కూడా ఇందులో సులువుగా పట్టేస్తాయి. ఈ కారు కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 

Post a Comment

0 Comments

Close Menu