12న హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ స్టూడియోస్ కార్యాలయం ప్రారంభం


హైదరాబాద్ లో ప్రముఖ ఓటీటీ, విఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ హౌస్ నెట్ ఫ్లిక్స్ స్టూడియోస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈనెల 12వ తేదీన ఈ ప్రారంభించనున్నారు. 30 వేల చదరపు అడుగులు విస్తీర్ణంతో రూపు దిద్దుకుంటున్న ఈ కార్యాలయం భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ రెండవ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. భారతదేశంలో పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నెట్ ఫ్లిక్స్ తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా హైదరాబాద్ ని ఎంపిక చేసుకొని ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం హైదరాబాద్ ప్రాధాన్యతను చాటి చెప్తోంది. హైదరాబాద్ ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత విఎఫ్ఎక్స్ సంస్థలకు నిలయంగా మారింది. డిస్నీ, స్కై లైన్ వీఎఫ్ఎక్స్, మాట్టెల్, వార్నర్ బ్రదర్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, యూబీ సాఫ్ట్, బార్న్ స్ట్రోమ్ vfx వంటి దిగ్గజాలు ఇప్పటికే హైదరాబాద్ నుండి హాలీవుడ్ చిత్రాలకు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్లోని ఏ వి జి సి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ లో ఎంట్రీ ఇవ్వడంతో సృజనాత్మకతతో పాటు సాంకేతిక ప్రతిభ గల యువతకు గణనీయమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటు ద్వారా అధునాతన స్కిల్స్ నేర్చుకోవడానికి, ఏవిజిసి నైపుణ్య అభివృద్ధికి దోహదం చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే డిజిటల్ కంటెంట్ సృష్టిలో హైదరాబాద్ దూసుకుపోతుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org