మైత్రీ వనంలో అగ్ని ప్రమాదం : నీలగిరి బ్లాక్‌లో చిక్కుకున్న విద్యార్థులు


హైదరాబాద్, అమీర్ పేట, మైత్రీ వనంలోని నీలగిరి బ్లాక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.  కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్‌లో చిక్కుకున్నారు. అక్కడి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్ పేట అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. ఐతే.. మంటలు మరింత పెరగకుండా.. కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది. అయినా ప్రయత్నిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org