2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం సాధించాలనే లక్ష్యానికి ఈ బడ్జెట్ బలమైన పునాది
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ వర్తమాన కలలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు. నేడు భారతదేశం సంస్కరణల దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీనిని అపార అవకాశాల బడ్జెట్‌గా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందనన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఆమె చారిత్రాత్మక రికార్డును సృష్టించారని ప్రధాని ప్రశంసించారు. "2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం సాధించాలనే లక్ష్యానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది. భారతదేశం నేడు ప్రయాణిస్తున్న 'సంస్కరణ ఎక్స్‌ప్రెస్'లోకి ఈ బడ్జెట్ కొత్త శక్తిని, వేగాన్ని అందిస్తుంది. ఈ విప్లవాత్మక సంస్కరణలు భారతదేశంలోని ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు ఆకాశాలను తెరుస్తాయి" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంపై దృష్టి సారించిన ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఇదని, దీనితో పాటు, అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధి కలయిక ఈ బడ్జెట్‌లో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. "ఈ బడ్జెట్ యువతకు అవకాశాలను, రైతులకు భద్రతను, వ్యవస్థాపకులకు ప్రోత్సాహాన్ని, మధ్యతరగతికి ఉపశమనం, కార్మికులకు గౌరవాన్ని అందిస్తుంది" అని ఆయన అన్నారు.