యాలకులు సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ యాలకులు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొందరికి మాత్రం యాలకులు తీసుకోవటం సరి కాదని నిపుణులు చెబుతున్నారు. యాలకులు జీర్ణశక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒక యాలక గింజ నమలడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవొచ్చు. కడుపులో మంటనూ తగ్గిస్తుంది. యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనను పోగొడతాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి. యాలకులు రక్తపోటును కంట్రోల్ చేయడంలో సాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను చాలావరకు తగ్గిస్తాయి. తరుచూ వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి ఇబ్బందులతో బాధపడేవారికి యాలకులు మంచి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచి ఈజీగా శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఇటీవల కాలంలో చాలామంది తమ పనుల వల్ల ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అలాంటి వారు యాలకుల టీ లేదా యాలకులు నోట్లో వేసుకుని నమిలితే మనుసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. అయితే, యాలకులు ఆరోగ్య పరంగా ప్రయోజనాలు కలిగించినా.. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవారు.. మరి కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకుంటున్నారు యాలకులు వినియోగించకపోవటం మంచిదని చెబుతున్నారు. అదే విధంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు సైతం యాలకులకు వాడకపోవటం బెటర్ అని సూచిస్తున్నారు. గర్భవతులు సైతం యాలకులు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచన చేస్తున్నారు. చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారు, ఇన్ఫెక్షన్లతో బాధ పడుతున్నవారు యాలకులకు దూరంగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments