అమెరికా అధ్యక్షుడిని హత్య చేస్తే ఇరాన్ అనేది భూమిపై నుండి తుడిచిపెట్టుకుపోతుంది !
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ఇరాన్ ఉద్దేశించిన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడిని హత్య చేయడంలో టెహ్రాన్ విజయం సాధిస్తే, ఇరాన్ అనేది భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. ఇప్పటికే తాను దృఢమైన సంకేతాలు ఇచ్చానని, ఏదైనా జరిగితే మాత్రం అలా జరగడం ఖాయమని చెప్పుకొచ్చారు. న్యూస్ నేషన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 28 నుంచి ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అయితే భద్రతా దళాల కాల్పుల్లో 5 వేల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారుల హత్యలు ఆగకపోతే అమెరికా దాడులు చేస్తోందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అమెరికా యుద్ధ విమానాలు కూడా ఆ దిశగా ప్రయాణం చేశాయి. ఇంతలో సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వం ఆ ప్రణాళిక నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఖమేనీ ప్రభుత్వం మారాల్సి ఉందని పేర్కొన్నారు. దీంతో ఇరాన్ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఖమేనీకి ఏదైనా జరిగితే అమెరికా అంతు చూస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.