తిరుమలలో భక్తులను భయభ్రాంతులను చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి !
తిరుమల కొండపై బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. చేతిలో కత్తి పట్టుకుని భక్తుల వెంట పరిగెత్తాడు. కత్తితో పొడుస్తా. చంపుతా అంటూ కేకలు వేస్తూ భక్తుల వెంట పడ్డాడు. ఈ సైకో చేష్టలతో భక్తులు పరుకులు పరుగులు పెట్టారు. భక్తుల పరుగులతో వెంటనే అలర్ట్ అయి తిరుమల ట్రాఫిక్ పోలీసులు సైకోని పట్టుకున్నారు. వాడి దగ్గర ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చానని చెబుతున్నాడు. పేరు అడిగితే ఏదేదో చెబుతున్నాడు. బిత్తర చూపులు, చేష్టలతో అతనికి మతిస్థిమితం లేదని తెలుస్తుందని, పోలీసులు మిగతా వివరాలు సేకరించి వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామంటున్నారు. పోలీసులు తిరుమల కొండపై ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .