సమ్మెకు దిగిన స్పెయిన్‌ వైద్యులు !


స్పెయిన్‌లో ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన చట్టాన్ని నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు. దీర్ఘకాలంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. స్పెయిన్‌ కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ యూనియన్స్‌ (సిఇఎస్‌ఎం) శుక్రవారం వరకు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పని పరిస్థితులు, న్యాయమైన పరిహారం, ప్రత్యేక శిక్షణ మరియు బాధ్యతల గుర్తింపు కోసం వైద్యులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతుండటంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. స్వచ్ఛంద మరియు పరిహారంతో కూడిన ఓవర్‌ టైంతో పాటు వారానికి గరిష్టంగా 35 గంటల పని, జరిమానా లేని సులభతరమైన ముందస్తు పదవీ విరమణ ఎంపికలు, విశ్రాంతి మరియు పని-జీవిత సమతుల్యతకు హామీ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org