తెలంగాణలోని హనుమకొండలో ఎల్కతుర్తి- సిద్ధిపేట నేషనల్ హైవే పక్కన ఎలా వచ్చాయో ఏమో కానీ వేలకొద్దీ నాటుకోళ్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో కోళ్లను దక్కించేందుకు జనం పరుగులు తీశారు. గుర్తు తెలియని వ్యక్తులు హైవే పక్కన వేలకొద్దీ నాటుకోళ్లు వదిలేసి వెళ్లడంతో కోళ్ల కోసం పత్తి చేల వెంట జనం పరుగులు తీశారు. కొంతమంది ఒకటి, రెండు కోళ్లతో సరిపెట్టుకొని చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొంతమంది దొరికిన కాడికి దొరికినట్లు పదుల కొద్దీ కోళ్ళను సంచుల్లో వేసుకొని పరుగులు తీశారు. సుమారు రెండు వేల కోళ్లు వదిలి వెళ్లారని అంటున్నారు స్థానికులు. ఇంత పెద్ద సంఖ్యలో నాటుకోళ్లను ఎవరు వదిలారు.. ఎందుకు వదిలివెళ్లారు అంటూ చర్చించుకుంటున్నారు స్థానికులు. ఇవాళ చాలా కుటుంబాలకు ఫ్రీగా చికెన్ విందుభోజనం దొరికినట్లయిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments