నాంపల్లి ప్రజా ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం నాంపల్లి ప్రజా ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. జనవరి 7వ తేదీకి ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పని చేశారు. ఆ సమయంలో నల్గొండలోని వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అలాగే హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నేరేడుచర్లలో బండి సంజయ్ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేశారు. నాటి ఘటనల్లో బండి సంజయ్‌పై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్.. నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.