కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించిన కర్ణాటక


ర్ణాటకలో రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు  ఐటీ వృద్ధిని విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ 28వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఈ పాలసీని ఆవిష్కరించారు. రాష్ట్రంలో బెంగళూరు దాటి ఇతర ప్రాంతాల్లో తమ ప్రతిభను విస్తరించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించనుంది. కంపెనీలు నియమించే ప్రతి ఉద్యోగికి రూ.50,000 వరకు వన్-టైమ్ రీలొకేషన్ ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రోత్సాహకంలో భాగంగా బెంగళూరు నుంచి మైసూరు, మంగళూరు, హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, శివమొగ్గ వంటి నగరాలకు ఉద్యోగులను తరలించే సంస్థలకు ఈ ప్రోత్సాహకం ఇస్తామని తెలిపింది. ఈ సందర్భంగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ 'బెంగళూరు మినహా ఇతర నగరాల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం రూ.445 కోట్లు కేటాయించింది' అని చెప్పారు. కొత్త ఐటీ పాలసీ 2025-30 కర్ణాటకను డీప్‌టెక్ ఇన్నోవేషన్ గమ్యస్థానంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ 'భారతదేశపు అతిపెద్ద ఐటీ ఆర్ అండ్ డీ, ఉత్పత్తి అభివృద్ధి కేంద్రం కర్ణాటక. రూ.3.2 లక్షల కోట్లకు పైగా విలువైన దేశ ఐటీ ఎగుమతుల్లో 42% వాటా కర్ణాటకదే. ఇది సంవత్సరానికి 27% చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో 550 కంటే ఎక్కువ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తంలో మూడింట ఒక వంతు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంటే ఎక్కువ సంస్థలు బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి' అన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org