వన్ప్లస్ కాంపాక్ట్ ఫోన్ కు సంబంధించి చైనాకు చెందిన టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో వెల్లడించింది. వన్ ప్లస్ ఏస్ 5 మినీ 6.3 అంగుళాల కస్టమ్ ఫ్లాట్ డిస్ ప్లేను కలిగి ఉండవచ్చు. ఇది 1.5కే రిజల్యూషన్ ను సపోర్ట్ చేస్తుంది. దీని డిజైన్ గురించి చెప్పాలంటే కెమెరా వెనకవైపు వర్టికల్ గా స్థానంలో ఉండనుంది. ఇది చూడటానికి గూగుల్ పిక్సెల్ సిరీస్ లాగా కనిపిస్తుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ సైజ్ కారణంగా దీన్ని ఉపయోగించడం మరింత సులభం కానుంది. ఫోన్ ప్రధాన హైలైట్ దాని 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్ కావచ్చు. అయితే దీనికి పెరిస్కోప్ లెన్స్ ఉండదు. ఈ కెమెరా సెటప్ గొప్ప ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు. ఇది స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ పై రన్ కానుంది. ఇది హై పెర్ఫార్మెన్స్, స్మూత్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. దీంతో పాటు షార్ట్ ఫోకస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో చూడవచ్చు. డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన ప్రకారం ఈ ఫోన్ ను 2025 రెండో త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ డివైస్ కు సంబంధించి వన్ ప్లస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
0 Comments