సంగారెడ్డి ఆస్పత్రిలో నవజాత శిశువు అపహరణ !


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు అపహరణ జరిగింది. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కాసేపటికే చిన్నారి కనిపించకుండా పోయింది. గుట్టుచప్పుడు కాకుండా శిశువును ఎత్తికెళ్లిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. నసీమాకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో గది బయట ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది, చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముగ్గురు మహిళలపై బాలిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంపైనా విచారణ చేపట్టారు. ఆస్పత్రి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొన్ని పోలీసు బృందాలు మహిళల కోసం గాలిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org