స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ !


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రం, రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సులో బ్యాటరీ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలు వేస్తూ భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరుగుతుందో స్థానికులు అర్థం కాలేదు. ప్రమాదం సంబంధించినప్పుడు బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌ వెంటనే బస్సు ఆపడంతో ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మంటలు వ్యాపించాయన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందారు. వెంటనే స్కూల్‌ వద్దకు చేరుకుని స్కూల్‌ యాజమాన్యం, బస్సు డ్రైవర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా స్కూల్‌ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇందతా జరగిందని బస్సును పరిశీలించి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగేవి కావని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం బస్సులను పరిశీలించిన తరువాతే డ్రైవర్‌ పిల్లలను బస్సులో ఎక్కించాలని డిమాండ్‌ చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org