టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు
ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు వైసీపీ నేతల తాలూకా రాసలీలలకు సంబదించిన వీడియోస్ బయటకు వచ్చి వైరల్ గా మారగా…ఇప్పుడు అధికార పార్టీకి సంబదించిన ఎమ్మెల్యే తాలూకా రొమాంటిక్ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోస్ చూసిన వారంతా ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారినా మనం పాలించే అధికారం ఇచ్చిందని మండిపడుతున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరా అని అనుకుంటున్నారా..? అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరి విజయం సాధించిన కోనేటి ఆదిమూలం ఈ వీడియోలను స్వయంగా బాధిత మహిళే విడుదల చేయడం ఇప్పుడు మరింత చర్చ గా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ప్రైవేటు హోటల్లో సదరు ఎమ్మెల్యే మహిళతో ఏకంతంగా గడుపుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. తన ప్రాణానికి హాని ఉందంటూ బాధితురాలు సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. అర్థరాత్రి వేళ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన ఇంట్లో గొడవలు తీవ్రమైనట్లు చెప్పింది. ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గోడు వెల్లబోసుకుంది. రాసలీలల వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు.