అక్టోబర్‌ 5న పీఎం కిసాన్‌ నగదు జమ !


క్టోబర్‌ 5న పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి రూ.2 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు. కాగా ఈ పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది.  రైతులు బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్‌ చేసుకోవాలి. పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకున్న రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ.. పీఎం కిసాన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org