విక్రయాల పరంగా నంబర్‌ 2కి ఎదిగిన షియోమీ !


గస్టు 2024లో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ 2వ స్థానంలో నిలిచిందని కౌంటర్‌ పాయింట్ కథనం. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆపిల్‌ మూడో స్థానానికి పరిమితం అయింది. తొలి స్థాయిలో శాంసంగ్‌ ఉంది. ఆగస్టు 2021 తర్వాత తొలిసారిగా గ్లోబర్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో విక్రయాల పరంగా ఆగస్టు 2024లో షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. సరఫరా కష్టాలు సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ల తరహాలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే అనంతరం ఉత్పత్తి, విక్రయాల్లో ప్రత్యేక వ్యూహాన్ని పక్కాగా అమలుచేసింది. షియోమీ ఈ సంవత్సరం Leaner ప్రొడక్ట్‌ స్ట్రాటజీని అవలంభించినట్లు రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠర్‌ తెలిపారు. దీని ఆధారంగా ఒకే ధర సెగ్మెంట్‌లో ఎక్కువ ఉత్పత్తులను లాంచ్‌ చేయడం కంటే ఒక్కో ధరలో ఒక్కో మోడల్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది. దీంతోపాటు మార్కెటింగ్‌ వ్యూహాల్లోనూ మార్పులు చేసింది. కొత్త మార్కెట్‌లలోకి విస్తరణతోపాటు ఇప్పటికే ఉన్న మార్కెట్‌లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పటికే షియోమీ ఎంట్రీ, మిడ్‌రేంజ్‌ ఉత్పత్తులు బలమైన పనితీరును కనబరుస్తున్నాయి. మరియు షియోమీ.. ఫోల్డబుల్‌, అల్ట్రా మోడళ్లతో ప్రీమియం విభాగంలోనికి ప్రవేశించింది. గత కొన్ని త్రైమాసికాల్లో కొన్ని మార్కెట్‌లలో షియోమీ పరిస్థితి మెరుగుపడింది. తక్కువ ధర కలిగిన బ్రాండ్‌లకు ప్రయోజనం కలిగింది. ఇప్పటికే తక్కువ ధర కలిగిన బ్రాండ్‌లలో షియోమీ బలంగా ఉంది. ముఖ్యంగా రెడ్‌మి 13 మరియు నోట్ 13ల విడుదల తర్వాత రెడ్‌మి పరికరాలు మరింత పాపులర్ అయ్యాయి. భారత్‌, లాటిన్‌ అమెరికా, ఆగ్నేసియా వంటి దేశాల సహా ఆఫ్రికాలో వాటాను పొందడంలో సాయపడింది. అయితే షియోమీ రెండో స్థానానికి చేరుకోవడంలో వ్యూహాలు, వృద్ధి కారణం అయితే.. ఆపిల్‌ కొత్త ఉత్పత్తుల విడుదల కూడా కారణంగా తెలుస్తోంది. కొత్త ఐఫోన్‌లు సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుండడంతో ఆగస్టు నెలలో విక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే రానున్న నెలల్లో ఆపిల్‌ అమ్మకాలు పుంజుకొనే అవకాశం ఉంది. ఫోల్డబుల్స్ వంటి ఉత్పత్తుల తయారీలో ఆవిష్కరణలు మరియు జనరేటివ్‌ AI ఫీచర్లు వంటి రంగాల్లో షియోమీ వంటి అగ్రశ్రేణి సంస్థలు తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షియోమీ రెండో స్థానంలో నిలవడం ట్రెండ్‌కు ప్రతీకగా చూడాలి. అయితే టెక్నాలజీ, ధరల పరంగా ఈ ఉత్పత్తులు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. అయితే విక్రయాలు, వ్యూహాలు పరంగా ఈ స్థానాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంటుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org