గూగుల్‌ మేజిక్‌ ఎరేజర్‌ ఫీచర్‌ !


గూగుల్‌ ప్రస్తుతం అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. గూగుల్‌ మేజిక్‌ ఎరేజర్‌ ఫీచర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫోటో ఎడిటింగ్‌ టూల్‌ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా క్యాప్చర్‌ చేసిన ఫోటోలోని అవసరం లేని వ్యక్తులు, వస్తువులను తొలగించేందుకు అవకాశం ఉంది.ఈ ఫీచర్‌ కోసం గతంలో గూగుల్‌ వన్‌ మెంబర్‌షిప్‌ లేదా పిక్సల్‌ స్మార్ట్‌ఫోన్‌ ను కలిగి ఉండాలి. ప్రస్తుతం ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌ ఫోటోస్‌ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీకు ఎడిట్‌ చేయాలని భావిస్తున్న ఫోటోను ఎంచుకొని ఎడిట్‌ పైన క్లిక్‌ చేయాలి. తర్వాత మేజిక్‌ ఎరేజర్‌ టూల్‌ను ఎంపిక చేసుకోవాలి. మేజిక్‌ ఎరేజర్‌ ఐకాన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఈ సమయంలో ఫోటోలోని అవసరం లేని వాటిని తొలగించడంలో గూగుల్‌ ఫోటోస్‌ సలహా ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం మీరు తొలిగించాలని భావిస్తున్న వాటిని తొలిగించేందుకు 'Erase all' పైన క్లిక్‌ చేయండి. ఆటోమేటిక్‌గా తొలగించడం సహా మాన్యువల్‌గానూ తొలగించవచ్చు. అందుకోసం ఫోటోలోని అవసరం లేని వస్తువులు లేదా గుర్తుల చుట్టూ సర్కిల్‌ గీయాల్సి ఉంటుంది. ఫలితంగా మీ ఫోటో నుంచి అవి తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లు మార్పులు చేసిన తర్వాత సేవ్‌ ఆప్షన్‌ పైన క్లి్‌క్‌ చేయాలి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org