ప్రధాని మోడీకి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అపురూప కానుక అందజేత !


జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్‌ విజయం సాధించిన మోడీ లఘు చిత్రాన్ని ఓ చేనేత కుటుంబానికి చెందిన దంపతులతో ప్రత్యేకంగా నేయించారు. ఈ కానుకను ప్రధానికి స్వయంగా అందజేశారు. ఎంపీ అప్పలనాయుడు సూచన మేరకు ఈ చిత్రాన్ని విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం లావేరు మండలానికి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు జూన్‌ మొదటి వారం నుంచి 40 రోజుల పాటు శ్రమించి పూర్తి చేశారు. మూడు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవు కలిగిన చేనేత వస్త్రంపై మోదీ చిత్రాన్ని తీర్చిదిద్దారు. బుధవారం స్వయంగా ఎంపీ అప్పలనాయుడు మోదీకి ఈ చిత్రపటాన్ని అందజేయగా.. ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ కానుక అందుకోవడం ఓ తీయని జ్ఞాపకంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. 40 రోజులపాటు శ్రమించి చేనేత వస్త్రంపై రూపొందించిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను ప్రధాని అభినందించారని అప్పలనాయుడు తెలిపారు. అంతేకాకుండా పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా మోడీకి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు గురించి మోడీ అడిగారని తెలిపారు. అశోక్‌ గజపతిరాజు ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అని వాకబు చేశారన్నారు. పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇవ్వగానే నాలుగైదు పేజీలు తిరగేశారని, ఆయన ఫొటోలను మోదీ పరిశీలనగా చూశారన్నారు. గుడ్‌.. గుడ్‌.. అని ప్రశంసించారని అప్పలనాయుడు తెలిపారు. పీవీజీ రాజు ఒక సామాజిక చైతన్యవేత్త అని ప్రధాని మోడీ కొనియాడారన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org