బియ్యం అక్రమ రవాణా విరమించుకోవాలని వ్యాపారులకు నాదెండ్ల మనోహర్ హెచ్చరిక !
ఆంధ్రప్రదేశ్ లో బియ్యం అక్రమ రవాణా చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని వ్యాపారులను మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు . కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర చెక్‌పోస్టును పరిశీలించిన ఆయన, ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. చెక్‌పోస్టుల వల్ల జాప్యం జరుగుతుందనే సాకుతో అక్రమ వ్యాపారం జరుగుతుందని.. మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.