ఆగస్టు 6 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ !
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 పేరుతో ప్రత్యేక సేల్‌ను ఆగస్టు 6 నుంచి నిర్వహించనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందు నుంచే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఎప్పటి వరకు ఈ సేల్ కొనసాగుతుందనే సమాచారం వెల్లడి కాలేదు. ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై గణనీయమైన డిస్కౌంట్‌లు పొందవచ్చని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతోపాటు ఇతర గృహోపకరణాలపైనా తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ S24, ఐకూ 12, రెడ్‌మి నోట్ 13 ప్రో 5G, వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ 12, రియల్‌మి నార్జో 70 ప్రో, ఐకూ నియో 9 ప్రో, రెడ్‌మి 13 5G, శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌లు సహా మరిన్ని బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరలో కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో భాగంగా విమాన టికెట్ల బుకింగ్ పైన డిస్కౌంట్లను అందించనుంది. విమాన టికెట్లపై గరిష్ఠంగా 20 శాతం డిస్కౌంట్, హోటల్ బుకింగ్‌లపై 40 శాతం డిస్కౌంట్, దీంతోపాటు ట్రెయిన్ టికెట్లపై 100 శాతం రిఫండ్‌ను పొందవచ్చు. గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు. మరియు స్మార్ట్‌ఫోన్‌ల ప్రారంభ ధర రూ.6799 గా ఉంది. దీంతోపాటు ట్యాబ్లెట్‌లపైన 6 శాతం వరకు, హెడ్‌ఫోన్‌ల పైన 75 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. అదే స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని వెల్లడించింది. స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు. అదే ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై గరిష్ఠంగా 60 శాతం తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది. అమెజాన్ ఫైర్ టీవీ మరియు అలెక్సా ఉత్పత్తులపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.