ఆగస్టు 21న ఐక్యూ జెడ్9ఎస్ సిరీస్‌ను విడుదల !


గస్టు 21న ఐక్యూ జెడ్9ఎస్ సిరీస్‌ను  విడుదల చేస్తున్నట్టు కంపెనీ సీఈవో నిపున్ మారియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా విడుదల తేదీతో పాటు ఫోన్ ఇమేజ్ ను అప్ లోడ్ చేశారు. గోల్డెన్ కలర్‌లో నయా స్టార్ట్ ఫోన్ ఆకట్టుకుంటోంది. అలాగే సెగ్మెంట్ లో వేగవంతమైన కర్వ్డ్ స్క్రీన్ ఫోన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే ఇటీవల ఐక్యూ జెడ్9ఎస్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో ఒకదాని డిజైన్‌ను మరియా పరిచయం చేశారు. వైట్ కలర్‌లో వైట్ మార్బుల్ డిజైన్‌తో ఎంతో ఆకట్టుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ పై భాగంగా ఎడమ వైపు దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. కుడి వైపు అంచున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీఈవో మారియా మాట్లాడుతూ జెడ్ సిరీస్ లో కంపెనీ ఒకేసారి రెండు మోడళ్లను విడుదల చేయడం ఇదే ప్రథమమన్నారు. ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఐక్యూజెడ్9ఎస్ హ్యాండ్‌సెట్‌లలో ఒకటి గీక్ బెంచ్ లో కనిపించింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ ఆధారంగా పని చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org