పశువైద్యురాలు హారిక భౌతికకాయం తరలింపులో ఇబ్బందులు !


మెరికాలో రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన పశువైద్యురాలు హారిక మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హారిక భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సాయం చేయాలని తెదేపా సామాజిక మాధ్యమం కార్యకర్త స్వాతిరెడ్డి 'ఎక్స్‌' వేదికగా మంత్రి లోకేశ్‌ను కోరారు. ఆ పోస్టుకు స్పందించిన మంత్రి, హారిక కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆమె భౌతికకాయం త్వరగా స్వస్థలానికి తెప్పించేలా ఎన్నారై తెదేపా విభాగం కృషి చేస్తోందని వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఐతానగర్‌లో ఉంటున్న దేవాదాయశాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు, నాగమణి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హారిక (24) గతేడాది పశువైద్యురాలిగా పట్టా అందుకున్నారు. అనంతరం అమెరికాలో పశువైద్య విభాగంలో ఎంఎస్‌ చేసి ఇక్కడి పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలన్న ఆలోచనతో గత ఆగస్టులో అక్కడకు వెళ్లారు. రోజు మాదిరిగానే భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆమె తన విధులు ముగించుకుని తోటివారితో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. వీరి వాహనం వెళుతున్న ప్రధాన దారిలో ద్విచక్ర వాహనదారు ఒక్క సారిగా కిందపడటంతో కారును వెంటనే నిలిపేశారు. దాంతో వెనుక నుంచి ఒకదాని వెంట మరొకటి మొత్తం మూడు వాహనాలు హారిక కారును ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org