నరసాపురం ఎంపీడీవో అదృశ్యం పై వెంటనే విచారణ చేపట్టండి !


ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారితీసిన పరిస్థితుల పై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వెంకట రమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి ఆరా తీశారు. నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిలు అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఫెర్రీ బకాయిలు వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే అందించాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ఉప క్రమించాలని ఆదేశించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org