వికలాంగ సోదరులను కించపరిచే వ్యాఖ్యలని స్మితా సభర్వాల్‌ ట్వీట్‌పై మంత్రి సీతక్క !


లిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. వికలాంగ సోదరులను కించపరిచే వ్యాఖ్యలని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మంత్రి సీతక్క ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందన్నారు. ఆమెకు ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు. తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఒక అధికారి ఫిజికల్‌ ఫిట్​నెస్‌ గురించి స్మితా సభర్వాల్‌ స్పందించడం తప్పుగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఉద్యోగాలకు ఆఫీసులో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకుని మాట్లాడాలని స్మితా సభర్వాల్‌కు హితవు పలికారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు సీఎం దృష్టికి వెళ్లి ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. ఫిజికల్ ఫిట్​నెస్ అనేది దేవుడు ఇచ్చేదని ఐఏఎస్, ఐపీఎస్​ పని వేరని పేర్కొన్నారు. అనాదిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకోవాలన్నారు. అంగవైకల్యంతో ఎంతోమంది గొప్ప స్థానాలకు వెళ్లారని గుర్తుచేసిన మంత్రి.. ఇతరుల సమర్ధత గుర్తించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందని సీతక్క ఘాటుగా స్పందించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org