వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకానున్న రేవంత్ రెడ్డి !
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఈనెల 8న మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం మంగళగిరి చేరుకుని 5 నుంచి 6:30గంటల వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్తారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటారు.