చిత్రపురి కాలనీలో మహిళపై వీధికుక్కల దాడి !


హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిత్రపురి కాలనీలో వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై దాడికి దిగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వాటి దాడి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. చుట్టుముట్టిన వీధి శునకాల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడిపోయినా కుక్కలను అదిలించే ప్రయత్నం చేసింది. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు, కారు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బాధిత మహిళ భర్త ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఊర కుక్కలకు ఇంటి బయట అన్నం పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ''ఇంటి ముందు కుక్కలకు అన్నం పెడితే నా భార్యకు ఎదురైన పరిస్థితే మీకు కూడా రావొచ్చు'' అంటూ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org