గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ సమీపంలో దాదాపు 10 సింహాలు ట్రాక్ పై నిద్రిస్తుండగా, అది చూసిన లోకో పైలట్ సడన్ గా బ్రేకులు వేశాడు. దీంతో వాటి ప్రాణాలను రక్షించాడు. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుండి ప్రధాన కారిడార్ పక్కన ఒక చిన్న ట్రాక్ పై వస్తున్నాడు. అయితే “ట్రాక్‌లపై విశ్రాంతి తీసుకుంటున్న 10 సింహాలను గుర్తించిన వెంటనే మీనా ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. అంతేకాకుండా.. సింహాలు లేచి పట్టాలపై నుంచి వెళ్లే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. లోకో పైలట్ చేసిన ఈ పనిపై పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు. సింహాలతో సహా వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అనేక చర్యలు చేపడుతుంది. ఈ మార్గంలో వెళ్లే.. లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారు.. అంతేకాకుండా.. నిర్దేశించిన వేగ పరిమితి ప్రకారం రైళ్లను నడుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. అభయారణ్యం చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో పులులు తిరుగుతాయని అధికారులు తెలిపారు.
0 Comments