ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నిబంధనలు సవరించిన కేంద్ర ప్రభుత్వం !


ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు ఆరు నెలల కంటే తక్కువ సమయం కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ డబ్బును విత్ డ్రా చేసుకునే వెసులుబాటును  కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీనికోసం, "స్కీమ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్" 1995 (EPS 95) నిబంధనలను సవరించింది. ఈ సవరణ ఫలితంగా, ఆరు నెలల కంటే తక్కువ కాలం పాటు చందా కట్టిన సభ్యులు కూడా ఉపసంహరణ ప్రయోజనాన్ని పొందుతారు. ఇప్పటి వరకు, కనీసం ఆరు నెలల పాటు ఈపీఎఫ్ కి కాంట్రిబ్యూట్ చేయాలనే నియమం ఉంది. ఈ నియమాన్ని మార్చడం వల్ల సుమారు 7 లక్షల ఈపీఎఫ్ మెంబర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఆరు నెలల కంటే తక్కువ సమయం చందా కట్టి ఈపీఎఫ్ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్లు, ఇప్పుడు, తాము కట్టిన డబ్బులను వెనక్కు తీసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉన్న ఉద్యోగి తన మూల వేతనంలో 12% మొత్తాన్ని ఈపీఎఫ్ఓలో జమ చేయాలి. ఆ కంపెనీ యాజమాన్యం కూడా అంతే మొత్తంలో డబ్బును జమ చేస్తుంది. ఉద్యోగి జమ చేసిన 12% మొత్తం ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలోకి వెళ్తుంది. యజమాన్యం ఇచ్చే 12% కాంట్రిబ్యూషన్లో.. 8.33% ఉద్యోగుల పింఛను పథకం ఖాతాలోకి, మిగిలిన 3.67% ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. పింఛను పొందేందుకు కనీసం 10 సంవత్సరాల పాటు ఈపీఎఫ్ఎం కు కాంట్రిబ్యూట్ చేయాలన్న రూల్ ఉన్నప్పటికీ, లక్షలాది మంది సభ్యులు ఈ పథకం నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాంటి సభ్యులందరికీ, పథకం నిబంధనల ప్రకారం, డబ్బును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షల విత్ డ్రా బెనిఫిట్ క్లెయిమ్ లను పరిష్కరించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org