వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ నేతలు భేటీ !
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పుష్ప శ్రీవాణితో పాటు వంగా గీత, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీ మోపీదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే డా. సుధ తదితరులు ఉన్నారు. ఎన్నికలు ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు.