చంద్రబాబు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు !


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ కొనియాడారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు. గతంలో ఉద్యోగాలు లేకుండా యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్‌కు మంచి శాఖలనే కేటాయించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన తన సత్తా చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉంది. అలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతం. అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజా సేవ చేస్తే పదవులు వాటికవే వస్తాయి'' అని సుమన్‌ తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org