మృతదేహాలతో కొచ్చికి బయలుదేరిన భారత వైమానిక దళం విమానం


కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళం ప్రత్యేక విమానం కువైట్ నుంచి బయలుదేరింది. ఈ విమానం మొదట కేరళలోని కొచ్చి చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఉన్నారు. సింగ్ గురువారం కువైట్‌కు చేరుకుని అక్కడి భారతీయుల మృతదేహాలను ముందస్తుగా అప్పగించేందుకు కువైట్ అధికారులతో చర్చించారు. విమానం మొదట కొచ్చి తర్వాత ఢిల్లీకి వస్తుంది. ఈ పార్థివదేహాలను కొచ్చి, ఢిల్లీలోని ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు అందజేయనున్నారు. అయితే మరణించిన 45 మంది భారతీయుల్లో 23 మంది కేరళ వాసులు ఉన్నారు. తమిళనాడు నుంచి 7, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 3, బీహార్‌, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, హర్యానా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org