బెంగుళూరు పోలీసుల అదుపులో నటి హేమ ?
కర్నాటక రాజధాని బెంగుళూరులో గత నెల 20వ తేదీన జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమపై బెంగుళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ నిర్థారణ పరీక్షల్లోనూ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినట్లు సమాచారం. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని హేమకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేయగా అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కావడం లేదని ఆమె పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హేమ డుమ్మా కొట్టడటంతో సీరియస్‌గా ఉన్న బెంగుళూరు సీసీబీ పోలీసులు ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నటి హేమను రేపు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.