పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు !


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన శాఖలపై సమీక్షలు చేస్తూనే మరోవైపు ఏమాత్రం ఖాళీ దొరికినా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన ఛాంబర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు మంగళగిరి పార్టీ కేంద్రానికి వచ్చారు. బాధితులను డిప్యూటీ సీఎం నేరుగా కలుసుకుని వారి సమస్యలను విన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వారి దృష్టి తీసుకెళ్లారు. ఓ బాధిత మహిళ తమ బిడ్డ కిడ్నాప్ కు గురై 9 నెలలైందని పవన్ కల్యాణ్ ముందు బోరుమంటూ విలపిస్తూ చెప్పింది. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ సంబంధిత పోలీసు స్టేషనుకి ఫోన్ చేస్తూ హలో సీఐ సర్, ఆడబిడ్డ మిస్ అయి 9 నెలలైందట, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసారట. కానీ బిడ్డ ఆచూకీ  ఇంతవరకూ తెలియలేదు. వెంటనే కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయండి'' అంటూ ఆదేశించారు. గతంలో తమ సమస్యలను చెప్పుకునేందుకు రోజులతరబడి వేచి చూడాల్సి వచ్చేదనీ, సమస్య చెప్పుకోవాలన్నా భయపడాల్సి వచ్చేదని పలువురు బాధితులు చెబుతూ తమ సమస్యలను విని వెంటనే పరిష్కరించాలని స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org