త్వరలో నీటి సమస్యకు పరిష్కారం : ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ లోని పంప్‌హౌస్‌ను ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ ఆదివారం సందర్శించారు. త్వరగా దానికి మరమ్మతులు చేయాలని, సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ఇతర ప్లాంట్‌లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ గురించి ఎక్స్ వేదికగా ఆతిశీ మాట్లాడుతూ ''అధిక వర్షాల వల్ల చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని పంపింగ్ హౌస్‌లో మోటార్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో నీటి అంతరాయం కలిగింది. సమస్యను పరిష్కరించడానికి జల్ బోర్డు రంగంలోకి దిగింది. ప్లాంట్ లో దాదాపు 80 శాతం మరమ్మతులు పూర్తయ్యాయి. త్వరలో అంతరాయం లేకుండా నీటి సమస్యను పరిష్కరిస్తాం'' అని తెలిపారు.