గరికపాటి బిందు మాధవ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత !


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారి గరికపాటి బిందు మాధవ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో అల్లర్లు జరిగాయి. హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో అప్పటి పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందు మాధవ్‌ను సస్పెండ్‌ చేస్తూ గతంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఘటనలు జరిగిన తీరుపై ఐపీఎస్‌ అధికారి బిందు మాధవ్‌ వివరణ ఇచ్చారు. వివరణను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన అధికారులు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org