రోడ్డు ప్రమాదంలో 13మంది భక్తులు మృతి !
కర్నాటకలోని హావేరి జిల్లా బాదగి తాలూకా గుండెనహళ్లి క్రాస్ వద్ద టిటి వాహనం లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతులంతా చించోలి ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శివానిగ్గా వాసులుగా గుర్తించారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. చనిపోయిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు.