వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవడం ఎలా ?
వాట్సాప్ లో అనేక కొత్త ఫీచర్స్ వస్తూనే ఉన్నాయి.. అవన్నీ కూడా మంచి ఎక్స్ పీరియన్స్ తో పాటుగా సెక్యూరిటీని కూడా అందిస్తున్నాయి. దాంతో ఎక్కువ మంది వాట్సాప్ ను వాడుతుంటారు.. ఫోటో పంపించాలన్న వీడియో పంపించాలన్న లేదంటే ఏమైనా డాక్యుమెంట్స్ వంటివి పంపించాలన్న వాట్సాప్ ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి.. ఒక్కోసారి మనం చాలా మందికి చాలా సార్లు మెసేజ్ లు పంపిస్తాము.. అయితే కొన్ని సార్లు రిప్లై రాదు, లేదా డెలివరీ అయినట్లు రెండు టిక్స్ రావు. దీంతో బ్లాక్ చేశారేమో అని అనుమానం వస్తుంది. మీరు ఎవరైనా ప్రొఫైల్ ను ఎక్కువ కాలం చూడలేకపోతే బ్లాక్ చేశారని అర్థం. మీరు ఎవరి స్టేటస్ ను ఎక్కువ కాలం చూడకపోతే మిమ్మల్ని బ్లాక్ చేశారు అని భావించాలి. ప్రొఫైల్ ఫోటో కూడా కనపడకపోయినట్లయితే బ్లాక్ చేసినట్లు అర్థం. ఒక్కోసారి మెసేజ్ లు కూడా పోవు దాంతో మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్ధం.