ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ?
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహెల్ ఎస్బీఐ ఖాతాకు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం యువకుడిని రాయదుర్గం పోలీసు స్టేషన్కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు.