ఆపిల్‌ నుంచి ఐఫోన్‌ ఎస్ఈ 4 జెన్‌ ?


పిల్‌ నుంచి త్వరలో ఐఫోన్‌ ఎస్ఈ 4 జెన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. గత మోడళ్ల కంటే ఈ హ్యాండ్‌సెట్‌ అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ రెవెగ్నస్‌ X పోస్టు ఆధారంగా ఐఫోన్‌ SE 4 హ్యాండ్‌సెట్‌ అమెరికాలో $425 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.35000) ఉండవచ్చని లేదా కనీసం 10 శాతం ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతోపాటు మరో X యూజర్‌ 'no longer exits' అంచనా ప్రకారం $500 గా (భారత కరెన్సీ ప్రకారం రూ.41,600) ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఐఫోన్ SE 4 హ్యాండ్‌సెట్‌ 2025 సంవత్సరంలో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు మరో నివేదిక ప్రకారం.. ఐఫోన్‌లలో ఐఫోన్ SE 4 తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది. ఐఫోన్ 14 తరహా డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు నాచ్‌ డిజైన్‌తో వచ్చే అవకాశముంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.1 అంగుళాల OLED స్క్రీన్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ తరహాలో యాక్షన్‌ బటన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 48MP ప్రైమరీ కెమెరా సహా USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రముఖ ఆపిల్ అనలిస్ట్‌ Nguyen phi Hung అంచనా ఆధారంగా ఐఫోన్ SE 4.. సుమారుగా 166 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. మరియు 7000 సిరీస్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ముందు, వెనుక గ్లాస్‌ ప్యానల్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల LTPS OLED ప్యానల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 60Hz రీఫ్రెష్‌ రేట్‌ తో రానుందని సమాచారం. దీంతోపాటు ఆపిల్‌ A16 బయోనిక్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 6GB LPDDR5 ర్యామ్ మరియు 128GB లేదా 512GB NVMe స్టోరేజీతో జతచేయబడే అవకాశం ఉంది. 3000mAh లేదా 3279mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. Magsafe ఛార్జింగ్ సపోర్టుతో 20W వైర్‌ ఛార్జింగ్ మరియు 12W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుందని సమాచారం. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.3 మరియు USB-C కనెక్టింగ్‌ సపోర్టుతో రానుంది. f/1.8 అపేచర్‌తో మరియు 1/2.55" సైజ్‌తో IMX503 కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఈ కెమెరా 1080p సినిమాటిక్‌ మోడ్‌, డీప్‌ ఫ్యూజన్‌, స్మార్ట్‌ HDR, ఏఐ ఫోటోగ్రఫీ మరియు పొర్ట్రెయిట్‌ మోడ్‌ సపోర్టు చేస్తుందని సమాచారం. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org