కేరళలో ఏఐ టీచర్ !


కేరళలోని ఓ స్కూళ్లో ఏఐ టీచర్ ప్రత్యక్షమైంది. తిరువనంతపురంలోని స్కూల్లో ఏఐ టీచర్‌ను తీసుకొచ్చింది. దేశంలోనే మొట్ట మొదటి మానవ రూప రోబో ఉపాధ్యాయురాలిని ప్రవేశపెట్టిన ఘనత కేరళకు దక్కింది. మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహాకారంతో ఈ కొత్త ఏఐ టీచర్‌ను డెవలప్ చేశారు. దీనికి 'ఐరిస్' అని  పేరు పెట్టారు. అచ్చం మనుషుల్లానే ఈ మానవ రోబో విద్యార్థులకు పాఠాలు చెప్పేస్తోంది. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేస్తోంది. ఈ ఐరిస్ టీచర్ స్కూళ్లలో పాఠ్యేతర కార్యకలాపాలను అందించనుంది. 2021 నీతి ఆయోగ్ చొరవతో అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏఐ టీచర్‌ను ప్రవేశపెట్టారు. ఏఐ టీచర్ ఎలా పాఠాలను బోధిస్తుందో పరీక్షించింది. చీరకట్టులో ఈ ఏఐ టీచరమ్మ విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు, పాఠ్యాంశాలకు సంబంధించి అడిగిన సందేహాలకు కూడా సమాధానాలను ఇస్తోంది. మొత్తం మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. ఈ మానవ రూప రోబోలో ప్రత్యేకించి ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కన్నా అత్యంత అడ్వాన్సడ్ టెక్నాలజీని ఉపయోగించారు. స్కూళ్లలో టీచర్స్ ఎలా విద్యార్థులకు పాఠాలను బోధిస్తారో అలానే చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. విద్యార్థులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా వాటికి వెంటనే సమాధానాలిస్తోంది. వివరణ కూడా ఇస్తోంది. విద్యార్థులకు షేక్ హ్యాండ్ కూడా ఇస్తోంది.ఈ ఐరిస్ టీచర్ రోబో నడిచేందుకు కాళ్ల కింది భాగంలో చక్రాలను కూడా అమర్చారు. విద్యార్థుల వద్దకు నేరుగా వెళ్లి వారితో మాట్లాడగలదు. ఈ ఏఐ టీచర్ రాకతో కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఐరిస్‌కు పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడంలో శిక్షణ పొందింది. ఈ ఐరిస్ టీచరమ్మ పాఠాలు చెబుతున్న వీడియోను మేకర్ ల్యాబ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంలో వైరల్ అవుతోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org