హిందుస్థాన్ యూనిలీవర్ లో భారీ లేఆప్స్ ?
హిందుస్థాన్ యూనిలీవర్ మాతృసంస్థ యూనిలీవర్ ఐస్ క్రీం యూనిట్‌ను స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటించింది, దీని ఫలితంగా కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగాలు కోల్పోతారు. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి కానున్న ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి మూడు సంవత్సరాలు మొత్తం పునర్నిర్మాణ ఖర్చులు ఇప్పుడు గ్రూప్ టర్నోవర్‌లో 1.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.