యూట్యూబ్ యాప్ ద్వారా మొబైల్ నుంచే వీడియోలను ఎడిట్ ?
భారత్‌లో ఎట్టకేలకు యూట్యూబ్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి గత ఏడాదిలోనే ఈ ప్రీ యూట్యూబ్ క్రియేట్ యాప్ ప్రకటించగా.. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రీ-ఛార్జ్ యూట్యూబ్ యాప్ ద్వారా ఆసక్తిగల వినియోగదారులు షార్ట్‌లు చేసుకోవచ్చు. లేదంటే లాంగ్-ఫారమ్ కంటెంట్ రెండింటికీ వీడియో ఎడిటింగ్‌ను చేసుకోవచ్చు. వినియోగదారులు తమ క్రియేటివిటీకి మరింత పదును పెట్టేందుకు స్టోరీ ఆధారిత వీడియోలను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇప్పుడు భారత్ సహా 13 దేశాలలో అందుబాటులో ఉండగా.. అందులో ప్రధానంగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో బీటా మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ప్రకారం.. ఇప్పటివరకూ ఉన్న యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనేది చాలామందికి కష్టంగా ఉందనే చెప్పాలి. ఎక్కువ సమయం తీసుకోవడమే కాదు.. ఖరీదైన ప్రక్రియ కూడా. అయితే, ఈ కొత్త యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఆ సమస్యకు చెక్ పడినట్టే. ఎడిటింగ్ అనేది ప్రతిఒక్క వినియోగదారుడికి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, అనేక ఫీచర్లను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త, ఇప్పటికే ఉన్న యూట్యూబ్ క్రియేటర్లకు వీడియో క్రియేషన్ మరింత సులభతరం అవుతుంది. ఈ కొత్త యాప్ ప్రారంభించిన తర్వాత గత కొన్ని నెలల్లోనే గ్లోబల్ క్రియేటర్ కమ్యూనిటీ నుంచి అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ అందుకుంది. అవసరమైన ఫీచర్లను కూడా చేర్చింది.