పది భారతీయ యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ ?


దేశంలోని పది పాపులర్ యాప్ లపై  గూగుల్ కఠిన చర్యలు తీసుకుంది. ఈ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఎందుకంటే ఈ యాప్ లు గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించడం లేదు. గూగుల్ ప్లే స్టోర్లో రెండు లక్షలకు పైగా భారతీయ యాప్ డెవలపర్లు తమ బిల్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారని, అయితే ఈ పది యాప్ లు మాత్రమే తమ సర్వీసుల కోసం గూగుల్ ప్లే స్టోర్ కు  ఇంకా నగదు చెల్లించలేదని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో రాసింది. చెల్లింపులకు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఇచ్చిందని,  సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత కూడా మూడు వారాలు గడిచిందని తన బ్లాగ్ పోస్ట్ లో  స్పష్టంగా రాసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ లను తీసివేయడానికి ముందు గూగుల్ ఈ బ్లాగ్ పోస్ట్ ను  విడుదల చేసింది. గూగుల్  నిర్ణయం కారణంగా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్ లను తీసివేసింది. వీటిలో Kuku FM, Bharat Matrimony, Shaadi.com , Naukri.com , 99 Acres, Truly Madly, Quack Quack, Stage, ALTT (Alt Balaji) యాప్స్ ఉన్నాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org