వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ టెక్ తో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో !


దేశీయ మారేట్లో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ను ఏప్రిల్ నెలలో లాంఛ్ చెయ్యన్నట్లు అప్డేట్ ను విడుదల చేసింది. లాంఛ్ అప్డేట్ తో పాటుగా ఈ ఫోన్  టాప్ ఫీచర్ ను కూడా బయట పెట్టింది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఛార్జ్ టెక్ ను గురించి వివరాలను టీజర్ పేజ్ నుండి బయట పెట్టింది. ఈ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ గా వ్యవహరించనున్న Flipkart నుండి ఈ వివరాలతో టీజ్ చేస్తోంది. అంతేకాదు, కంపెనీ అధికారిక X అకౌంట్ నుండి కూడా టీజ్ చేస్తోంది. ఈ ఫోన్ All-Round Fast Charge 2.0 టెక్ తో వస్తుందని కన్ఫర్మ్ చేసింది. ఈ టెక్ గురించి మరిన్ని ఇతర వివరాలను కూడా ఇన్ఫినిక్స్ అందించింది. ఈ ఫోన్ ను 20W వైర్లెస్ మ్యాగ్ ఛార్జింగ్ ఫీచర్ తో వస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కు వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా ఉంటుంది. అంటే, ఈ ఫోన్ తో ఇతర వైర్లెస్ పరికరాలను నేరుగా వైర్లెస్ ఛార్జ్ చేసుకునే అవకాశం ఈ ఫోన్ లో అందించింది.



Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org