వన్‌ప్లస్ 12R కొత్త వేరియంట్ సేల్ ప్రారంభం !
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 8GB ర్యామ్ +128GB స్టోరేజీ, 16GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా 12R 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.42999 గా నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్ నేటి నుంచి OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్ మరియు ఇతర వన్‌ప్లస్ స్టోర్లు, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొత్త వేరియంట్ ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు వన్‌కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ బోనస్ కింద రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఎక్స్చేంజీ బోనస్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేస్తే రూ.1000 అదనపు ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు. అంటే రూ.4000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కింద కొంత మంది వన్‌ప్లస్ 12r కొనుగోలుదారులు.. రూ.4,999 విలువైన వన్‌ప్లస్ బడ్స్ Z2 ఉచితంగా పొందవచ్చు. వన్‌ప్లస్ 12R కొత్త వేరియంట్ కొనుగోలుపై 9 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియో ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 15 నెలలపాటు రూ.150 చొప్పున తగ్గింపును పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.2250 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. 1264*2780 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను పొందుతుంది. అల్యూమినియం మెటల్ ఫ్రేమ్, గ్లాస్‌ను కలిగి ఉంటుంది. ఆక్టా కోర్ 4nm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 12GB లేదా 16GB LPDDR5x ర్యామ్ మరియు అడెన్నో 740 GPU తో జతచేయబడింది. గరిష్ఠంగా 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.