త్వరలో మార్కెట్ లోకి రానున్న ఎగిరే కారు !


మెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ఎగిరే కారును అభివృద్ధి చేసింది. త్వరలో ఇది మార్కెట్ లోకి రాబోతుంది. రోడ్డుపై దూసుకుపోతూ ట్రాఫిక్ అధికంగా ఉన్న చోట పక్షిలా గాల్లో ఎగురుతుంది. తాజాగా డెట్రాయిట్ లో నిర్వహించిన ఆటో షోలో గాలిలో ఎగిరే కారును ప్రదర్శించారు. ఈ ఏడాది జూన్ లో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ కారుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు. దీని ధర సుమారు రూ.2.46 కోట్లు. విద్యుత్ శక్తితో నడిచే ఈ కారు రోడ్డుపై 200 మైళ్ల వరకు ప్రయాణించగలదు. గాలిలో అయితే 110 మైళ్ల వరకు ఎగరగలదు. ఈ కారులో నుంచి 180 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటు ఉంది. అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ 2022లోనే ఈ కార్లను ముందస్తు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org