రియల్ మీ సీ 55 విడుదల !


రియల్ మీ సీ 55 పేరుతొ విడుదల చేసిన రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో ప్రీమియం iPhone 14 pro లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ వంటి అమరికను అందించింది. స్క్రీన్ పైన ఉన్న సెల్ఫీ కెమెరా చుట్టూ ఉన్న కొంత ప్రాంతం నోటిఫికేషన్ బార్ గా మారిపోయి, వినూత్నమైన పద్దతిలో నోటిఫికేషన్లను చూపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో లాంచ్ చేశారు. బేసిక్ వేరియంట్ 6GB+128GB, ధర Rp 2.499.000 (సుమారు రూ.13,300) తో లాంచ్ చేయబడింది.  రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది. కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org