ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు !


ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌లో 1995 స్కీమ్‌లోని పేరా 11(3) ప్రకారం సెప్టెంబర్‌ 1, 2014కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ నిబంధనల పరిధిలోకి వస్తారు. అంటే సెప్టెంబర్‌ 1,2014కి ముందు రిటైరైన ఉద్యోగులు, రిటైర్మెంట్‌కు ముందే సదరు ఉద్యోగులు అధిక పింఛన్‌ కోసం ఆప్షన్ తీసుకొని ఉండంతో పాటు ఇతర కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఉన్న ఉద్యోగులు మాత్రమే అర్హులు. పూర్తి స్థాయి సమాచారం కోసం ఈపీఎఫ్‌ఓ కార్యాలయాన్ని సందర్శించాలని విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ 2014లో ఓ సవరణ చేసింది. ఆ సవరణ ప్రకారం ఉద్యోగులు పెన్షన్‌ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్‌ పే ప్లస్‌ డియర్‌నెస్‌ అలవెన్స్‌) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్‌ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌లో తీర్పును వెలువరించింది. ఉద్యోగుల పెన్షన్‌ (సవరణ) పథకం-2014 చెల్లుబాటును సమర్థించింది. అయితే, పీఎఫ్‌లో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org