అకారణంగా ఫేస్‌బుక్‌ అకౌంట్లు లాక్


ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ యూజర్ల అకౌంట్లను లాక్ చేసింది. ఎందుకు అకౌంట్లను లాక్ చేయాల్సి వచ్చిందో సరైన కారణాన్ని వెల్లడించలేదు. ఏ కారణం లేకుండానే ఫేస్ బుక్ అకౌంట్లను లాక్ చేయడంపై ఫేస్ బుక్ యూజర్లు మండిపడుతున్నారు. ఉన్నట్టుండి చాలా మంది ఫేస్ బుక్ యూజర్లకు అకౌంట్లను లాక్ చేసినట్టుగా మెసేజ్ లు పంపుతోంది. 'మీ ఫేస్ బుక్ అకౌంట్ మా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా రన్ అవుతోంది. మీ అకౌంట్ ను నిలిపివేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం' అంటూ మెసేజ్ లో ఉంది. అకౌంట్లను లాక్ చేయడానికి ముందు మెటా కంపెనీ ఎలాంటి హెచ్చరిక చేయలేదు. అలాగే లాక్ చేయడానికి గల కారణాన్ని కూడా మెటా యాజమాన్యం వివరణ ఇవ్వలేదు. దీనిపై ఫేస్ బుక్ యూజర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే యూజర్ల ఫిర్యాదులపై స్పందించిన మెటా కంపెనీ దర్యాప్తు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా మెటా కంపెనీ ప్రతినిధి ఆండీ స్టోన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొంతమంది యూజర్లకు తమ Facebook అకౌంట్లను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం' అని తెలిపారు. ఇప్పటివరకూ ఎంతమంది ఫేస్ బుక్ యూజర్లు Account Lock సమస్యను ఎదుర్కొన్నారో తమకు తెలియదన్నారు ఆండీ.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org